ఆగండి ఆగండి! అప్పుడే నాగురించి పొగరుబోతు లాంటి బిరుదులు వెతికేసుకోకండి. చెప్తా! నేను ఆ మాట అనటానికి వచ్చిన పరిస్థితుల గురించి చెప్తాను. తరువాత మనం ఒక నిర్ణయానికి వద్దాం.
ఈ మాట సహజంగా ప్రతి NRI చెప్తారు. కారణాలు అనేకం. కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను.
- విదేశములలో జీవించే మనవాళ్ళు సహజంగా వారికి సంబంధించిన అన్ని పనులు వారే చేసుకుంటారు. ఉదాహరణకు పాయఖానాలు కడగటం. నేను చెప్పేది నిజం. అక్కడ మగవాళ్ళు, ఆడవాళ్ళు అనే తేడా ఉండదు. అక్కడ 99% మంది మగవాళ్ళు కనీసం ఒకసారి అయినా ఈ పని ఖచితంగా చేసిఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఇక్కడకి (మన భారతదేశమునకు) వచ్చి ఇక్కడ రోడ్డుమీద ఉన్న చెత్తను చూసి ముక్కు మూసుకుంటారు. చఛ! ఇండియా ఇంతే ! అని కూడా అంటారు. ఎందుకు?
నిజం కొంచెం చేదుగా ఉంటుంది. అది అనేవాళ్ళ పొగరు, విదేశములనుండి వచ్చాం అనే ఆభిజాత్యమో కాదు. నిజమ్. అక్కడి పాయఖానాలు కూడా మనం రోజు నడిచే రోడ్డు కంటే పరిశుభ్రంగా ఉంటాయి.
No comments:
Post a Comment