Thursday, 8 January 2015

చఛ! ఇండియా ఇంతే !

ఆగండి ఆగండి! అప్పుడే నాగురించి పొగరుబోతు లాంటి బిరుదులు వెతికేసుకోకండి. చెప్తా! నేను ఆ మాట అనటానికి వచ్చిన పరిస్థితుల గురించి చెప్తాను. తరువాత మనం ఒక నిర్ణయానికి వద్దాం. 
ఈ మాట సహజంగా ప్రతి NRI చెప్తారు. కారణాలు అనేకం. కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. 
  1. విదేశములలో జీవించే మనవాళ్ళు సహజంగా వారికి సంబంధించిన అన్ని పనులు వారే చేసుకుంటారు. ఉదాహరణకు పాయఖానాలు కడగటం. నేను చెప్పేది నిజం. అక్కడ మగవాళ్ళు, ఆడవాళ్ళు అనే తేడా ఉండదు. అక్కడ  99% మంది మగవాళ్ళు కనీసం ఒకసారి అయినా ఈ పని ఖచితంగా చేసిఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఇక్కడకి (మన భారతదేశమునకు) వచ్చి ఇక్కడ రోడ్డుమీద ఉన్న చెత్తను చూసి ముక్కు మూసుకుంటారు. చఛ! ఇండియా ఇంతే ! అని కూడా అంటారు. ఎందుకు? 
నిజం కొంచెం చేదుగా ఉంటుంది. అది అనేవాళ్ళ పొగరు, విదేశములనుండి వచ్చాం అనే ఆభిజాత్యమో కాదు. నిజమ్. అక్కడి పాయఖానాలు కూడా మనం రోజు నడిచే రోడ్డు కంటే పరిశుభ్రంగా ఉంటాయి.